దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంపై స్పందించారు. ప్రభాస్ రెమ్యునరేషన్ ను పక్కన పెడితే… ఆ చిత్రాన్ని మొత్తం బడ్జెట్ లో ఐదో వంతు ఖర్చుతో తీసేయవచ్చని తెలిపాడు. సినీ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదని చెప్పారు. కథలోని ఎమోషన్స్ ను విజువల్ ఫీస్ట్ చంపేస్తుందని అన్నారు. బాలీవుడ్ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించి అది విడుదలయ్యేంత వరకు కూడా ఎవరికీ తెలియదని…. కేవలం రూ. 4 నుంచి 5 కోట్లతో తెరకెక్కిన ఆ చిత్రం రూ. 100 కోట్లను వసూలు చేసిందని అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమని చెప్పారు. ఒక నటుడి ముందు సినిమా సాధించిన వసూళ్ల ఆధారంగానే ఆయన తదుపరి సినిమాపై అంచనాలు ఉంటాయని వర్మ అన్నాడు.
విజువల్ ఎఫెక్ట్ కంటే కథలో దమ్ము ఉండాలి – రాధేశ్యామ్ చిత్రంపై ‘వర్మ’ స్పందన
Advertisement
తాజా వార్తలు
Advertisement