యూరప్ లో తక్కువ సమయంలో రికార్డుస్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు యూరప్ లో వంద మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా ప్రపంచవ్యాప్తంగా నమోదన మొత్తం కరోనా కేసుల్లో మూడింట ఒక వంతు యూరప్ లోనే నమోదయ్యాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత మళ్లీ కరోనా హాట్‌స్పాట్ కేంద్రంగా యూరప్ మారింది. గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ తో పోరాడుతోంది. అట్లాంటిక్ తీరం నుంచి రష్యా వరకు 52 దేశాలు, గత రెండు సంవత్సరాల్లో మొత్తం 100,074,753 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో 2019లో కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 289,713,817 కరోనా కేసులు నమోదయ్యాయి.
గత వారం రోజుల్లోనే యూరోపియన్ దేశాల్లో 4.9 మిలియన్లకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఇవే కేసులే అత్యధికమని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత వారం ఒక్క ఫ్రాన్స్ లోనే ఒక మిలియన్ కంటే ఎక్కువ కొత్త కేసులను నమోదయ్యాయి. అక్కడ వెలుగుచూసిన కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రకటించిన అన్ని సానుకూల కేసులలో 10 శాతానికి సమానం. లక్ష మంది జనాభాకు కరోనా వ్యాప్తి నిష్పత్తి రేటు అధికంగా ఉన్న దేశాలు సైతం యూరప్‌లోనే ఉన్నాయి. అయితే, అధికారిక లెక్కలు ఇలా ఉన్నప్పటికీ.. గణాంకాల్లో పరగిణించని కేసులు అధికంగా వుండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..