Friday, November 22, 2024

ఇసుక ఎక్కువ.. సిమెంట్, కంకర తక్కువ.. వీటిని సీసీ రోడ్లు అంట‌రా సార్‌!

కన్నాయిగూడెం, (ప్రభన్యూస్):
ములుగు జిల్లా క‌న్నాయిగూడెం మండలంలోని గూర్రేవూలా గ్రామంలో నాణ్య‌త లేకుండా సీసీ రోడ్డు ప‌నులు చేప‌ట్టారు. ఇసుక ఎక్కువ, సిమెంట్‌, కంక‌ర త‌క్కువ కావ‌డంతో రోడ్లు అప్పుడే డ్యామేజీ అవుతున్నాయి. 2వ వార్డులో సీసీ రోడ్డు నాణ్యత లోపంతో వేశారు. ఈ రోడ్డుపై కంకర పైకి తెలుతోంది. సిమెంట్ దుమ్ములా పైకి లేచి నిత్యావసర వస్తువులపై పడి ఇబ్బందులు ఎదురుకుంటున్నామ‌ని గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు.

ఈనెల 22 వరకు సీసీ రోడ్లు పూర్తి చేస్తే ఇన్ టైంలో బిల్లులు పొందవచ్చని కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. మండల కేంద్రంలోని సీసీ రోడ్ల పనులు అన్ని నాణ్యత లోపానికి నిదర్శనంగా క‌నిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేస్తున్నామ‌ని చెబుతున్న ప్రజాప్రతినిధులు సీసీ రోడ్లకు కావాల్సిన మెటీరియల్ ఇసుక ఎక్కువగా వాడుతూ.. సిమెంటు, కంకరను త‌క్కువ‌ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయ‌డంతో రోడ్లు దెబ్బ‌తిని మ‌ట్టికంటే ఘోరంగా త‌యార‌వుతున్నాయ‌ని గ్రామస్తులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement