హైదరాబాద్, ఆంధ్రప్రభ : వన్యప్రాణుల అక్రమ వేట నిరోధక చర్యల్లో భాగంగా అడవుల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర అటవీశాఖ సిద్ధమైంది. కొద్ది కాలంగా వేటగాళ్ళు రెచ్చిపోవడంతో పాటు అడవుల్లోని జంతువులు సమీప గ్రామాల్లోకి సం చరించడం, పశువులను వధించడం వంటి ఘోరాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువుల కదలికలపై ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతో పాటు అదనంగా కెమెరాలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా అటవీశాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదే శాలు జారీ అయ్యాయి. ఇప్పటికే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులతో పాటు అన్ని అటవీ డివిజన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు మరిన్ని కెమెరాలతో నిఘాను పటిష్టం చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం నూతన ప్రణాళికను అమ ల్లోకి తెచ్చింది. అందులో భాగంగా అటవీ రక్షణ సిబ్బ ందిని పెంచి, ఆధునిక ఆయుధాలతో క్షేత్రస్థా యిలో నిఘాను పటిష్టం చేసింది. అందివచ్చిన నూతన టెక్నా లజీని వినియోగించుకుంటూ అడవుల్లో సీసీ కెమెరా లను ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో అడవుల్లోకి అక్రమంగా చొరబడే కలప దొంగలు, స్మగ్లర్లు, వేటగాళ్ళు, వాహనాల కదలికలను సీసీ కెమెరాలతో పరిశీ లిస్తున్నారు. అలాగే టింబర్ డిపోల కు వెళ్ళే కలప వాహనాలపై నిఘా పెట్టారు. ఎక్కడి క్కడ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేయడంతో పాటు కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. అడవిని ఆధారంగా చేసుకుని జీవించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడమే కాకుండా అడవుల సంరక్షణపై కార్య క్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా, అటవీ సంరక్షణ కోసం అటవీ శాఖ కోట్లాది రూపా యలను ఖర్చు పెడుతున్నప్పటికీ వేటగాళ్ళు మాత్రం వన్యప్రా ణులను వేటాడుతున్న ఘటనలు బయట పడుతు న్నాయి.
వారం రోజుల క్రితం నల్లమల అటవీ ప్రాంతం లోని చింతలబైలులో ఓ ముఠా పెట్టిన ఉచ్చుకు చిరుతపులి బలై పోయింది. ఆ పులి గోళ్ళు, దం తాలను తీసుకుని కళేబరాన్ని తగు లబెట్టారు. ఈ ఘట నకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అటవీ రక్షణ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుం డా జింకలు, అడవి పందులు వంటి జంతువు లను వేటగాళ్ళు సంహరించి పట్టణ ప్రాం తా ల్లో మాం సాన్ని విక్రయిస్తున్నట్లుగా అటవీ శాఖ అధి కారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో యాంటీ పోచింగ్పై అన్ని అటవీ డివిజన్ల పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.