ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ రగడ ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఒక వైపు ప్రభుత్వం ఉద్యోగులను చర్చలకు ఆహ్వానిస్తోంది.. అయితే ఉద్యోగులు మాత్రం చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు. అయితే తాజాగా… పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనల పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తాం అన్నారాయన. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు.
ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదని, ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి ఉండేదన్నారు. కొత్త పేస్కేళ్లతో వేతన బిల్లులను రూపొందిస్తున్న డీడీఓలను పని చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. హెచ్ఆర్ఏ శ్లాబుల పై నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని, ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువే ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వం ఆలోచించిందని సజ్జల పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..