Monday, November 25, 2024

Spl Story: మాన్​సూన్​ సీజన్​.. వీకెండ్​ రోడ్​ ట్రిప్​కి ఇవే బెటర్​ ప్రదేశాలు!

వర్షాకాలం సీజన్​ కొనసాగుతోంది.. ప్రకృతి అందాలను తిలకించడానికి ఇంతకంటే మంచి టైమ్​ ఉండదు. కొండలు, కోనలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అద్భుతమైన జలపాతాలు, నదులు ఉప్పొంగుతున్నాయి.. నీటితో వాగులు, వంకలు తొణికిసలాడుతున్నాయి. ఈ క్రమంలో అనేక ప్రాంతాలు ఆధ్యాత్మిక స్వర్గధామంగా మారే సమయం ఇది. నిత్యం జనాలతో ఉక్కిరిబిక్కిర అయ్యే హైదరాబాద్‌ ప్రజలు.. కాంక్రీట్​ జంగిల్​ నుంచి కాస్త రిలీఫ్​ కోరుకుంటారు. అయితే.. అట్లాంటి వారు అందమైన ప్రకృతిని ఎంజాయ్​ చేయడానికి సిటీకి దగ్గర్లో చాలా ప్రాంతాలున్నాయి.

– డిజిటల్​ మీడియా విభాగం, ఆంధ్రప్రభ

కురుస్తున్న వానలకు సిటీ జనం కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తుంటే.. వాటర్​ లాగింగ్స్​, ట్రాఫిక్ సమస్య వంటివి ఇంకొంతమందిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.. నగరంలో బిజీ పనులు, రణగోన ధ్వనుల నుండి దూరంగా వెళ్లాలి.. ప్రశాంతతను ఎంజాయ్​ చేయాలనుకునే వారికి ‘మాన్సూన్ రోడ్ ట్రిప్’ ఎంతో బెటర్​. ఈ ధోరణి చాలామందిలో ఉంటుంది.. అయితే.. హైదరాబాద్ నుండి రోడ్ ట్రిప్‌ కోసం అనేక మార్గాలున్నాయి. ఈ అయిదు ప్రాంతాలను పరిశీలించండి.. ప్రశాంత ప్రపంచానికి తీసుకెళ్తాయని చెప్పవచ్చు..

హైదరాబాద్ సమీపంలో టూర్​ చేయడానికి ఐదు బెస్ట్​ ప్లేసెస్​ని ఉన్నాయి. ఈ ప్రదేశాలు చాలా వరకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కేవలం 1-2 గంటల ప్రయాణ దూరంలో ఉంటాయి. అవి ఆహ్లాదకరమైనవాతావరణంలోకి తీసుకెళ్తాయని కచ్చితంగా అనుకుంటున్నాం. మీరు అక్కడి ప్రతి అందాన్ని ఇష్టపడతారు. హైదరాబాద్ వెలుపల 100కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్రదేశాలు వీకెండ్​లో టూర్​కి బెటర్​ అనే చెప్పవచ్చు.

1. అనంతగిరి కొండలు

- Advertisement -

వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి కొండలున్నాయి. హైదరాబాద్ నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఈ స్పాట్​ ఉంది. ఈ మినీ హిల్‌స్టేషన్ దట్టమైన అరణ్యంలో ఉంది. పచ్చని ప్రకృతి దృశ్యాలతో ఇక్కడ అందమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఆఫ్‌బీట్ ప్రయాణికులకు సరైన ప్రదేశం. చుట్టుపక్కల క్యాంపింగ్, ట్రెక్కింగ్ కోసం అవకాశాలను కూడా ఉన్నాయి..

2. భువనగిరి కోట

భోంగీర్(భువనగిరి) కోట హైదరాబాద్ నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భోంగీర్ పట్టణంలో ఉంది. NH163 – హైదరాబాద్ – వరంగల్ హైవే ద్వారా రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. మెట్లు కొంచెం నిటారుగా ఉండడంతో కోట పైకి ఎక్కడం కొంచెం కష్టం. గుడ్డు ఆకారంలో ఉన్న భారీ రాయి చురుకుదనాన్ని మరియు బలాన్ని పరీక్షిస్తుంది. అయితే ఎత్తైన ప్రదేశానికి చేరుకున్న తర్వాత బర్డ్​ ఐ చాలా బాగుంటుంది. ఇది చాలా మంత్రముగ్దులను చేస్తుంది.

3. కొండపోచమ్మ సాగర్

సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ మండలం కొండపోచమ్మ సాగర్​ ఉంది. హైదరాబాద్ నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాదీలకు ఇటువంటి ప్రదేశం ఒకటి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఇది గత రెండు సంవత్సరాలుగా అపారమైన ప్రజాదరణ పొందింది.

4. కోట్‌పల్లి రిజర్వాయర్

నీటి సాహసాలను ఇష్టపడే వారైతే కోట్‌పల్లి మంచినీటి రిజర్వాయర్‌లో కయాకింగ్‌ని ప్రయత్నించాలి. ఇది వీకెండ్​ లీవ్స్​లో బెటర్​ ప్లేస్​. వికారాబాద్ హిల్స్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి 95 కి.మీ దూరంలో ఉంటుంది.

5. రాచకొండ కోట

మీ స్నేహితులతో చాలా త్వరగా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తుంటే కనుక రాచకొండ కోట సరైన ప్రదేశం. ఇది హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం సహజ సౌందర్యం, ప్రశాంతత కచ్చితంగా అందరినీ మంత్రముగ్ధులను చేస్తుందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement