Saturday, November 23, 2024

కోతుల‌కు కుటుంబ నియంత్ర‌ణ – మంత్రుల స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్రంలో ఐదు నుండి ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు కోతులు ఉన్నాయి. దాంతో తెలంగాణ స‌ర్కార్ ఓ నిర్ణ‌యాన్ని తీసుకుంది. కోతుల‌కు కుటుంబ నియంత్ర‌ణ చికిత్స అవ‌స‌ర‌మ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఈ మేర‌కు స‌మీక్ష‌ని చేప‌ట్టారు. ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని… ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్సల నిర్వహణకు అవకాశాల పరిశీలన ఉంటుందని ప్రకటన చేశారు.

ఇక రైతులు వేసే పంటలకు కోతుల బెడద తీవ్రంగా ఉందని.. రైతులను ఈ ఇబ్బంది నుండి గట్టెక్కించాలన్నారు. చేతికొచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలని.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని తెలిపారు. పంటల వైవిద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement