టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కొంతమంది స్వామీజీలను బీజేపీ పంపిందన్న వార్తల నేపథ్యంలో ఈ విషయం హైకోర్టుదాకా వెళ్లింది. అయితే పోలీసులు కేసు రిమాండ్ రిపోర్టులో ఏం పేర్కొన్నారనే విషయాలపై అంతటా ఆసక్తి నెలకొంది. కాగా, తమకు ముందే సమాచారం అందిందని, ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తం అయ్యామని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఇక.. వారి సంభాషణలు, వీడియోలను రికార్డు చేసేందుకు రెండు ఆడియో రికార్డులు, నాలుగు సీక్రెట్ కెమెరాలను వాడినట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. హాల్‌లో సీక్రెట్ కెమెరా ఉందని, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కుర్తా జేబులో ఆడియో రికార్డర్ ఉందని వెల్లడించారు. ఈ కుట్ర కోణం వెనకాల ఉన్న ఒక్కో విషయం వెలుగులోకి వస్తుండడంతో దీనిపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఒక్కో విషయంలో బీజేపీ నేతల హస్తం ఉందన్న విషయాలు కూడా మరింత స్పష్టం అవుతున్నాయంటున్నారు పరిశీలకులు..