సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉండనంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యనించిన వేళ.. నటుడు మోహన్ బాబు ఆ బాధ్యత తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి ముందు రానున్నారు. ఏపీలో టికెట్ల రేట్లపై ప్రభుత్వానికి, అటు సినీ ఇండస్ట్రీకి కొంచం గ్యాప్ ఏర్పడింది. దీంతో టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వానికి మోహన్ బాబు లేఖ రాయబోతున్నారు. అనంతరం ఏపీ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇండస్ట్రీల సమస్యల పరిష్కారం కోసం ఆయన పెద్దరికం తీసుకోబోతున్న సంకేతాలు ఆ లేఖ ద్వారా పంపబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సినీ కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దరికం అనే హోదా తనకు ససేమిరా ఇష్టం లేదని చెప్పారు. పెద్దగా ఉండను కానీ బాధ్యతగల బిడ్డగా ఉంటానని చెప్పారు. అవసరం వచ్చినప్పుడు నేను ఉన్నానంటూ ముందుకు వస్తానని చెప్పారు. అనవసరమైన వాటికి తగుదునమ్మా అంటూ ముందు కొచ్చే ప్రసక్తే లేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. ఇద్దరు కొట్టుకుంటుటేం తగువు తీర్చమంటే నేను తీర్చనని చెప్పారు. పరిశ్రమ సమగ్ర అవసరాల కోసమైతేనే ముందుకు వస్తానని చిరంజీవి చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital