Saturday, November 23, 2024

తిరుపతి కోర్టుకు హాజరైన మోహన్ బాబు

సినీ నటుడు మోహన్ బాబు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోహన్ బాబు పై కేసు నమోదైంది. తిరుపతి కోర్టుకు మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులతో కలిసి హాజరయ్యారు. తిరుపతిలోని NTR సర్కిల్ నుండి మోహన్ బాబు, ఆయన ఇద్దరు కొడుకులు  మంచు విష్ణు, మంచు మనోజ్ పాదయాత్రగా కోర్టుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

విద్యార్ధుల కోసం తాను పోరాటం చేస్తే తనపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. తాను రియల్ హీరోనని ఆయన చెప్పారు.2014 నుండి 2019 వరకు  మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కింద ప్రభుత్వం నుండి రాలేదు. దీంతో పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడ  ఈ డబ్బులు చెల్లించలేదని అప్పట్లో మోహన్ బాబు ఆరోపించారు. ఈ విషయమై అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ అధికారులతో మాట్లాడినా కూడా ఫలితం దక్కలేదన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ  2019 ఎన్నికలకు ముందు తన కాలేజీ విద్యార్ధులతో కలిసి మోహన్ బాబు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆందోళన చేసినందుకు గాను మోహన్ బాబుతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేఃసులో మోహన్ బాబు ఈరోజు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement