Saturday, November 23, 2024

కొమ్మవీడిన కోయిలమ్మ.. ముంబైకి వెళ్లి నివాళులర్పించనున్న మోడీ

అనారోగ్యంతో చనిపోయిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు ముంబై చేరుకోనున్నారు. ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో ముంబైలోని క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో ఇవ్వాల కన్నుమూశారు. లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని పెద్దార్ రోడ్‌లోని ఆమె నివాసం నుండి ముంబైలోని శివాజీ పార్క్ కు సాయంత్రం 4.30 గంటలకు ప్రజల దర్శనం కోసం తరలించి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ నివాళులర్పిస్తారు.

లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ దేశం రెండు రోజుల పాటు సంతాప దినాలు పాటించనుంది. రెండు రోజుల పాటు జాతీయ జెండా సగం మాస్ట్ లో ఎగురుతుంది. అధికారిక వినోద కార్యక్రమాలేవీ ఉండవు.

మాటలకు మించిన వేదన: ప్రధాని మోడీ
ట్విట్టర్‌లో సంతాపాన్ని తెలియజేస్తూ.. ‘‘దయ, శ్రద్ధగల లతా దీదీ.. మమ్మల్ని విడిచిపెట్టినందుకు మాటల్లో చెప్పలేనంత వేదన కలిగింది.. ఆమె దేశంలో పూరించలేని శూన్యతను మిగిల్చింది. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి చిహ్నంగా గుర్తుంచుకుంటాయి. వారి మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేయగల అసమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది’’ అని మోడీ ట్వీట్ చేశారు.

‘‘లతా దీదీ నుండి నేను ఎప్పుడూ అపారమైన ఆప్యాయతను పొందడం నా గౌరవంగా భావిస్తున్నా. ఆమెతో నాకున్న పరిచయాలు మరువలేనివిగా మిగిలిపోతాయి. లతా దీదీ మరణించినందుకు ఎంతో బాధపడుతున్నాను. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపాన్ని వ్యక్తం చేశాను. ఓం శాంతి.” అని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement