Friday, November 22, 2024

మేఘాల‌య‌.. త్రిపుర రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన మోడీ.. ఎన్ ఈసీ స‌హ‌కారాన్ని ప్ర‌శంసించిన ప్ర‌ధాని

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేడు మేఘాల‌య‌..త్రిపుర రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు. ముందుగా మేఘాలయా రాష్ట్రంలో ఆయన పర్యటించారు. అక్కడి నుండి త్రిపుర టూర్ కి వెళ్లారు. మేఘాలయ టూర్ లో తొలుత షిల్లాంగ్ లో జరిగి న ఈశాన్య మండలి సమావేశంలో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు.1972లో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ను ప్రారంభించారు. ఎన్ ఈ సీ సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో గత ఎనిమిదేళ్లుగా అనేక అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించినట్టుగా మోడీ చెప్పారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిలో ఎన్ఈసీ సహకారాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు.

ఎన్ఈసీ స్వర్ణోత్సవ వేడుకలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ తో సమానంగా జరుగుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్మిగా పేర్కొన్నారు. ఎనిమిది అంశాలపై ఈ రాష్ట్రాల్లో అభివృద్దికి పనిచేస్తున్నామన్నారు.శాంతి, శక్తి, పర్యాటకం, 5 జీ కనెక్టివిటి, సంస్కృతి, సహజ వ్యవసాయం, క్రీడలు, సంభావ్యతపై కేంద్రీకరించిన పనిచేస్తున్నట్టుగా మోడీ చెప్పారు.ఆగ్నేయ ఆసియాకు ఈశాన్య ప్రాంతం ముఖద్వారమని ఆయన చెప్పారు. మయన్మార్ -థాయ్ లాండ్ ట్రైలేటరల్ హైవే, అగర్తలా-అఖౌరా రైలు ప్రాజెక్టు పనులు ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్టుగా ప్రధాని తెలిపారు. తూర్పు ప్రాంతంలో అబివృద్ది కార్యక్రమాలు విస్తరిస్తున్నట్టుగా చెప్పారు.ఈశాన్య రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఒప్పందాలతో తీవ్రవాద కేసులు గణనీయంగా తగ్గాయని గుర్తు చేశారు.సహజ వ్యవసాయం గురించి నొక్కి చెప్పారు. ఈ వ్యవసాయానికి ఈశాన్య రాష్ట్రాలు దోహదపడతాయని ప్రధాని చెప్పారు. ఈశాన్య ప్రాంతంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ది చేయడం ద్వారా క్రీడాకాలకు తోడ్పాటు అందిస్తున్నట్టు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు జలవిద్యుత్ పవర్ హౌస్ గా మారగలవని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.

దీంతో ఈ ప్రాంతంలోని రాష్ట్రాలు మిగులు విద్యుత్ రాష్ట్రాలుగా మారుతాయన్నారు. దీంతో పరిశ్రమల విస్తరణకు దోహదపడుతుందని పీఎం చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి లభ్యం కానుందన్నారు.ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకులను ఆకర్షిస్తుందని ఆయన చెప్పారు.ఈ రాష్ట్రాల్లో టూరిజం సర్క్యూట్ ను అభివృద్ది చేస్తున్నామన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కనెక్టివిటిని పెంచే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని ప్రధాని మోడీ చెప్పారు.

- Advertisement -

అయితే ఇటీవల కాలంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాయని మోడీ తెలిపారు.గత ఎనిమిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్ పోర్టుల సంఖ్య 9 నుండి16కి పెరిగినట్టుగా మోడీ గుర్తు చేశారు. అంతేకాదు ఈ ప్రాంతాలకు వచ్చే విమానాల సంఖ్య 900 నుండి 1900కి పెరిగిందని మోడీ తెలిపారు. రైల్వే మార్గాలు, జల రవాణాను కూడా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా మోడీ వివరించారు.2014 నుండి జాతీయ రహదారులు 50 శాతం పెరిగినట్టుగా ప్రధాని చెప్పారు. డివైన్ పథకం తో ఈశాన్య రాష్ట్రాల్లో మౌళిక సదుపాయాల ప్రాజెక్టులు మరింత ఊపందుకున్నాయన్నారు.ఈశాన్య ప్రాంతంలో డిజిటల్ కనెక్టివిటిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement