హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం ఆ దిశగా వనరులను సిద్ధం చేసుకుంటోంది. జమిలి ఎన్నికల వ్యూహంతో బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు రచి స్తోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండ డంతో, అప్పటిలోగా ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికల విధానం’పై చట్టాన్ని తీసుకొచ్చి పాగా వేయాలన్న ప్రయత్నం ముమ్మరంగా జరుగు తోంది. లోక్‌సభ ఎన్నికలతోనే తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం పెద్దలు పావులు కదుపుతు న్నట్లు సమాచారం. ఇటీవల
అధికారిక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కేసీఆర్ సర్కారుపై పరోక్షంగా హెచ్చరికలు చేయడం రకరకాలుగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్‌ఎస్ నాయకుల మధ్య విభేదాలు సృష్టించి భాజపాలోకి లాక్కునేందుకు ఢిల్లిd స్థాయిలో వ్యూహం, రాష్ట్ర స్థాయిలో అమలుకు కార్యాచరణ గోప్యంగా చేస్తోందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఇటీవల అధికార పార్టీని వీడి బీజేపీలో చేరిన కొంతమంది బడా నాయకులు ఈ వ్యూహానికి ఉప్పందిస్తున్నట్లు సమాచారం. తాజాగా తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఢిల్లిd స్థాయిలో జోరుగా చర్చ జరుగుతోంది. దేశంలో నరేంద్రమోడీపై నేరుగా తిరగబడిన ఏకైక నాయకుడు కేసీఆర్ కావడాన్ని ఆ పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో.. మోడీ, అమిత్‌షాతో పాటు కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘాన్ని రంగంలోకి దింపి రాజకీయం చేయాలన్న ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. తాజాగా, బీఆర్‌ఎస్ కేవలం ప్రాంతీయ పార్టీయేనని ప్రకటించడం తెరవెనుక వ్యూహానికి అద్దం పడుతోంది.
పలు సందర్భాల్లో జమిలి ఎన్నికల గురించి ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. బలమైన పోటీ-దారులు అయిన మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్ లాంటి వారిని ఒంటరిగా వెళితే ఎదుర్కోలేమని, సార్వత్రిక ఎన్నికలతోపాటే కొట్టాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీకి అసెంబ్లీకి పార్లమెంట్‌కు ఒకటే ఓటు- పడడం ఖాయమని ఇలా చేస్తే రాష్ట్రాల్లోనూ అధికారం దక్కుతుందన్న విశ్వాసం బీజేపీలో కనిపిస్తోంది. అందుకే ఈసారి డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికల కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు వెళ్లకుండా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పరిస్థితులన్నీ చక్కదిద్దాక వచ్చే ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఎలక్షన్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అలా అయితే కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టడంతో పాటు- బీజేపీకి రాష్ట్రంలో అధికారం దక్కుతుందని అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నారు. 2024లో మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికలను జరపాలని కేంద్రం లోతుగా కసరత్తు చెెస్తోంది. ఇందుకోసం ఈ ఐదు రాష్ట్రాల కాలపరిమితి ముగియగానే రాష్ట్రపతి పాలన విధించి మే నెలకు వాయిదా చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్‌తో పాటు- తెలంగాణ ఎన్నికలు జరిగితే కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం అవుతాడని, ఆయనను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిరోధించవచ్చన్న వ్యూహాత్మక చర్యల్లో భాగంగా బీజేపీ ఈ ప్రణాళిక చేస్తున్నట్టు- నిపుణులు చెబుతున్నారు.
గత ఎన్నికల సమయానికి సీఎం కేసీఆర్, ప్రధాని మోడీతో సఖ్యతగా ఉన్నారు. అందుకే ఆయన అనుకున్న విధంగా ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఈ సారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రధాని మోడీ, కేసీఆర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటో-ంది.
షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబరులో జరుగనున్న తెలంగాణ ఎన్నికలు, జనవరిలో జరుగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరిగే పార్లమెంటు- ఎలక్షన్స్‌తో కలిపే నిర్వహించే గట్టి ప్రణాళికతో ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. వీటితో పాటు- ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలూ జరుగనున్నాయి.
ఇదిలా ఉండగా గతంలో జమిలి ఎన్నికలకు గతంలో బీఆర్‌ఎస్ పార్టీ సైతం మద్దతు తెలిపింది. మరి ప్రస్తుతం ఆ విధానాన్ని అమలు చేస్తే గులాబీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం గతంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయా పార్టీల అభిప్రాయాలు, రాతపూర్వకంగా సమర్పించిన ప్రతిపాదనలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జమిలి ఎన్నికలపై పార్లమెంటు- ద్వారా చట్టం జరగడంతో సంబంధం లేకుండా పార్టీల అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుని వాటి వైఖరి ఇదేనంటూ కమిషన్ ఒక కారణంగా చూపే చాన్స్ ఉన్నది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో 2019 జూన్ 19న జరిగిన సమావేశానికి బీఆర్‌ఎస్ తరఫున హాజరైన కేటీ-ఆర్ జమిలి ఎన్నికలకు మద్దతు పలుకుతున్నట్టు- స్పష్టం చేశారు. దీని వల్ల ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం తగ్గుతుందని వివరణ ఇచ్చారు. అప్పటికే పార్టీ అధినేతగా కేసీఆర్ రాతపూర్వకంగా జమిలి ఎన్నికలకు మద్దతు పలుకుతూ రాసిన లేఖను ఆయన తరపున వినోద్ కుమార్ (అప్పటి ఎంపీ) 2018 జూలై 18న లా కమిషన్‌కు సమర్పించారు.