Friday, November 22, 2024

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్ షెడ్యూల్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ముందుగా ప్రక టించిన షెడ్యూల్‌ ప్రకారమే ఆయన తెలంగాణ పర్యటన ఉంటుందని పీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీకి సమాచారం అందించారు. ప్రధాని ఏర్పాట్లును వారం రోజుల నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది అధికారిక పర్యటన కావడంతో పీఎం పర్యటన ఏర్పాట్లు, భద్రతపై సీఎస్‌, డీజీపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అదే సమ యంలో ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ నాయ కులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం పార్టీ తరఫున స్వాగత తోరణాలు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. అక్కడ సికింద్రాబాద్‌- తిరుపతి వందేభారత్‌ రైలును ప్రారంభిస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్స వాలు చేయడంతోపాటు- పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత 1.30 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

వందేభారత్‌ రైలుకు పచ్చజెండా
తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్‌- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్‌ రైలును ప్రధాని మోడీ ప్రారంభిం చనున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందే భారత్‌ రైలులో ప్రయాణికులు కేవలం 8:30 గంటల్లో చేరుకుంటారని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనున్నట్లు- రైల్వేశాఖ తెలి పింది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగు రాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శ్రీకారం
సుమారు రూ.700ల కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి. ఆధునిక సౌకర్యాలు, మెరుగైన నిర్మాణ డిజైన్‌తో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ది చేస్తున్నట్లు- దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరా యం కలగకుండా దశలవారీగా ఈ ప్రాజెక్టును చేపడు తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను రాబోయే 40ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో విమానాశ్రయం తరహాలో పునరాభి వృద్ధి చేస్తున్నట్లు- అధికారులు తెలిపారు. ఈ పునర్‌ అభివృద్ధి పనులను 3 దశల్లో చేపట్టనున్నారు.
ప్రయాణికుల కదలికలు, వాహనాల కదలికలను నివారించ డానికి ప్రత్యేక ఎంట్రీ-, ఎగ్జిట్‌ బ్లాక్‌ల వంటి ప్రత్యేక సదుపా యాలు ఉండేట్లు- నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాలు సాఫీగా వెళ్లేందుకు స్టేషన్‌లో మల్టీ లెవల్‌, అండర్‌ గ్రౌండ్‌ కార్‌ పార్కింగ్‌ సౌకర్యాలు ఉండనున్నాయి. కొత్త స్టేషన్‌ బిల్డింగ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఎలక్ట్రానిక్‌ సైన్‌ బోర్డులతో సహా ఆధునికీకరించిన సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు- చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 5వేల కేడబ్లూపీ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు- చేస్తున్నారు. స్టేషన్‌ అవసరాల నిమిత్తం 16 లక్షల లీటర్ల నిల్వ సామర్థంగల నాలుగు జీఎల్‌ఆర్‌ సంప్‌లు ఏర్పాటు- చేస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేసి దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

ఎంఎంటీ-ఎస్‌ రెండో దశ సేవ‌లు ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని
ఎంఎంటీ-ఎస్‌ రెండో దశ సేవలను ప్రధాని ప్రారంభిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న మేడ్చల్‌- సికింద్రాబాద్‌- ఉందానగర్‌, మేడ్చల్‌ -సికింద్రాబాద్‌- తెల్లాపూర్‌ మధ్య ఎంఎంటీ-ఎస్‌ రైళ్లు ఈనెల 8వ తేదీ నుంచి అందుబాటు-లోకి రాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు- పూర్తి చేసినట్లు- దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. 2003లో ఎంఎంటీ-ఎస్‌ మొదటి దశ పనులు అందుబాటు-లోకి వచ్చాయి. 2014లో ఎంఎంటీ-ఎస్‌ రెండవ దశ పనులు ప్రారంభమయ్యాయి. రూ.816 కోట్ల వ్యయంతో 95కి.మీల మేర పనులు చేపట్టాలని రైల్వేశాఖ ప్రతిపాదనలు చేసింది. రెండవ దశలో సికింద్రాబాద్‌ -మేడ్చల్‌ మార్గంలో 28 కి.మీల వరకు ఉంటు-ంది. ఈ మార్గంలో లాలాగూడ గేట్‌, మల్కాజ్‌గిరి, దయానంద నగర్‌, సఫిల్‌గూడ, ఆర్‌.కే.పురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్‌, అల్వాల్‌, బొల్లారం బజార్‌, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లు అందుబాటు-లోకి రానున్నాయి. ఫలక్‌నుమా- ఉందానగర్‌ మధ్య శివరాంపల్లి, బుద్వేల్‌ స్టేషన్లు అందుబాటు-లోకి వస్తున్నట్లు- రైల్వే అధికారులు తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement