Saturday, November 23, 2024

మీరాబాయిపై ప్రశంసల వెల్లువ

టోక్యో ఒలిపింక్స్​లో భారత్ కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వెండి పతకం సాధించిన ఆమెకు రాష్ట్రపతి, ప్రధాని, రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు అంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి ఆమె దేశం గర్వపడేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. ఇది చాలా మంచి విజయం, చాలా మంచి రోజని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ అన్నారు. ఈ విజయం భారత క్రీడాకారుల్లో నైతిక స్థైర్యాన్ని నింపుతుందని రెజ్లర్ బజ్రంగ్ పూనియా అన్నాడు.

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా మీరాబాయిపై ప్రశంసల వర్షం కురిపించారు. గాయం నుంచి కోలుకుని మరీ పతకం సాధించి చరిత్ర సృష్టించావంటూ కొనియాడాడు. వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచావని పేర్కొన్నాడు. పతకం కోసం బరువులు మాత్రమే ఎత్తలేదు.. దేశాన్నే అంతెత్తుకు ఎత్తావు అంటూ ఫుట్ బాల్ కెప్టెన్ సునిల్ ఛెత్రి అభినందించాడు.  

ఇది కూడా చదవండిః టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం

Advertisement

తాజా వార్తలు

Advertisement