ప్రధాని నరేంద్ర మోడీ కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రేపు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. దేశంలో కరోనా పరిస్థితిపై రేపు ప్రధాని ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు 213కు చేరాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. తెలంగాణలో కూడా 24 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. మొత్తం కేసుల్లో ఇప్పటికే 90 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 113 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital