భారత ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. మోదీ భారత ప్రజల ఖర్చుతో పారెన్ టూర్‌కు వెళ్లి ఇండియాకు మేలు చేసే పనులు చేయాల్సింది పోయి.. తన జిగిరీ దోస్త్, బడా వ్యాపారవేత్త అదానికి ఆమ్‌దానీ చేకూరుస్తున్నారని మీమ్స్ రూపంలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి పలు రకాల ఉదాహరణలు కూడా చూపుతున్నారు. ఇందులో బాగా ఇంట్రెస్టింగ్‌గా, ఎక్కువగా ట్రోలింగ్‌లో ఉన్న ట్వీట్ మాత్రం ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వ విప్, బాల్క సుమన్ చేసింది సూపర్ అంటున్నారు నెటిజన్లు.
సోషల్ మీడియాలో ఈ ట్వీట్‌ని తెగ వైరల్ చేస్తున్నారు. 167.7కె ఫాలోవర్లతో మాంచి జోష్ మీదున్న బాల్క సుమన్ ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. వాటిలో కేంద్ర ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ చేసేవి కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ప్రధాని మోదీపై చేసిన ఈ ట్వీట్ సూపర్‌గా హల్‌చల్ చేస్తోంది.
అందులో.. మోడీ కలుస్తాడు, అదానీ ఆర్జిస్తాడు అన్న ట్యాగ్‌లైన్‌ని యాడ్ చేసి ఇవ్వడంతో నెటిజన్లు మరింత ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తితో చదువుతున్నారు. అంతేకాకుండా ఇది ఆత్మ నిర్భర్ భారత్ కాదని, అదానీ నిర్భర్ భారత్ అని సుమన్ టీజ్ చేయడం కూడా జనాలను ఆకట్టుకుంటోంది.
దీనిలో 1) ప్రధానంగా శ్రీలంక ప్రధానితో మోదీ భేటీ.. ఫలితం విండ్ పవర్ ప్రాజెక్ట్ అదానీ వశం.. 2) సౌత్ కొరియా ప్రధానితో మోడీ భేటీ.. ఫలితం 37,500 కోట్ల ప్రాజెక్టు అదానీ వశం.. 3) ఆస్ట్రేలియా వాణిజ్య శాఖ మంత్రితో మోడీ భేటీ.. ఫలితం, ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గనులకు లైన్ క్లియర్ అంటూ ఫొటోలను ఆధారంగా చూపడం కూడా అందరినీ ఆలోచనలో పడేస్తోంది. నిజంగా దేశ ప్రధాని మోదీ క్విడ్ ప్రోకో వంటి దారుణానికి పాల్పడుతున్నారా? అని చాలామంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఏం చేయాలన్నది కాలమే నిర్ణయిస్తుంది!