- మంటల్లో తగలడిపోతున్న రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను ఎవరూ పట్టించుకోరు
- దేశం కోసం పతకాలు సాధించిన రెజ్లర్లపై లైంగిక దాడులను ఎవరూ పట్టించుకోరు
- నష్టపోయాం, ఆదుకోండి అని మొత్తకుంటున్న రైతులను ఎవరూ పట్టించుకోలేదు
- ఇక.. తన ఎన్నికల వాగ్దానాలను అయితే.. ఏనాడూ పట్టించుకోలేదు
- అన్నింటికంటే మించి, ఎన్నికలు, ఓట్లు.. అతని పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) గురించి మాత్రమే పట్టించుకుంటారు
#ModiMadeDisaster
#ModiNotWelcome
అని ఉన్న ట్విట్టర్ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌ని తెలంగాణ రినేవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై. సతీశ్‌రెడ్డి క్రియేటివ్‌గా చేశారు. దీనికి పెద్ద ఎత్తున వ్యూస్, లైకులు, షేరింగ్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఈ ట్వీట్ చూసిన వారి నుంచి ‘‘గన్‌షాట్ పాయింట్స్ చాలాబాగున్నాయి అన్నా.. పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్ దింపారు”అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ ట్వీట్‌ని మంత్రి కేటీఆర్ తదితరులు రీట్వీట్ చేయడం గమనార్హం..
- Advertisement -