Friday, November 22, 2024

ప్ర‌పంచ దేశాధినేత‌ల్లో అత్యంత జనామోదం ఉన్న నేత‌గా మోడీ – మార్నింగ్ క‌న్స‌ల్డ్ స‌ర్వేలో వెల్ల‌డి

వ‌రుస‌గా మూడో ఏడాది కూడా ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ నేత‌గా నిలిచారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ ని తోసి ప్ర‌థ‌మ‌స్థ‌నంలో మోడీ నిల‌వ‌డం విశేషం. . మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత జనామోదం ఉన్న నేతగా అత్యధిక మంది మోడీకే పట్టం కట్టారు. 21 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించారు. మరో 7 శాతం మంది తమకేం తెలియద‌ని తెలిపారు. 72 శాతం మంది ఆయనకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 64 శాతం మంది మద్దతు ప్రకటించారు. 57 శాతం మంది ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో ర్యాంకు సాధించారు.

జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు 47 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఐదో స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఒలాఫ్ షూల్జ్ (42%) నిలిచారు. బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయనకు కేవలం 41 శాతం మందే ఓటేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూలకూ 41 శాతం మందే మద్దతు తెలపడంతో.. బైడెన్ తో పాటే సంయుక్తంగా ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 37 శాతం ఓట్లతో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఏడు, 36 శాతం ఓట్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జయర్ బోల్సోనారో ఎనిమిదో ర్యాంకు, 35 శాతం ఓట్లతో ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ 9వ ర్యాంకు, 30 శాతం మంది ఆమోదంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదో స్థానంలో నిలిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement