Tuesday, November 26, 2024

Spl Story: మోదీ మామూలోడు కాదు.. బుడ్డగోచితో సహా అన్నీ అమ్మేస్తాడు! (వైరల్​ వీడియో)

ప్రధాని మోదీపై సోషల్​ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్​ అవుతున్నాయి. తాను 2014లో అధికారం చేపట్టినప్పుడు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న దానికి అస్సలు పొంతనే లేదంటూ ఈ వీడియోల్లో వివరంగా పొందుపరిచారు. అంతేకాకుండా, దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మేస్తున్న విధానాన్ని స్పష్టంగా తెలియజేశారు. అందులో బీపీఎల్​ అమ్మేశాడు, ఎల్​ఐసీ అమ్మేశాడు, ఎయిర్​ ఇండియా అమ్మేశాడు.. బ్యాంకులను అమ్మేశాడని వివరాలతో సహా ప్రచారం చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోడీ ఇలా అన్నాడని.. “దేశాన్ని అమ్మనివ్వనని నేను ఒట్టుపెట్టుకున్నా.. ఈ మట్టి మీద ఒట్టేసి చెబుతున్నా ఈ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనివ్వను”అని సభలో ప్రజల సాక్షిగా చెబుతాడు. కానీ, అదే మట్టిమీద ఒట్టేసి ఇప్పుడు ‘‘నేను దేశాన్ని బతకనివ్వను, మొత్తం అమ్మేస్తాను”అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని వీడియో క్రియేట్​ చేశారు.

అంతేకాకుండా.. పంటలను బతకనివ్వను, పాడి బతకనివ్వను, రైతులను బతకనివ్వను, చిరు వ్యాపారులను బతకనివ్వను, బ్యాంకులను బతకనివ్వను.. గొంతెత్తి మాట్లాడితే నిన్ను గోచీతో కూడా బతకనివ్వను అనేలా ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయని వివరాలతో సహా వీడియోలో చూపించారు. అయితే.. ఇన్ని చేసి, ఇవన్నీ అమ్మేసిన తర్వాతే ప్రధాని మోదీని, కేంద్రంలోని బీజేపీ సర్కారును సవాల్​ చేయాల్సి వస్తోంది.

కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను రక్షించటం అంటే, దీన్నే అంటారా? విషయం ఏంటంటే.. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థని కాపాడాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం కాదు అని, వాటిని మరింత బలోపేతం చేసి ప్రజలకు మరింతగా చేరువ చేయాలని రాజకీయ రంగ, ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.

కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నించక ఉన్న వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోంది. ఇక అన్నీ అమ్మేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే ఓ నలుగురిని ఉద్ధరించే పనిలో పడిందని, అంబానీ, అదానీ వంటి బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న తీరును ఈ వీడియోలో చూపించారు.  ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది వ్యవస్థలను బాగుచేయడానికే కానీ, వేర్లతో సహా పీకి, నాశనం చేసి అమ్మెయ్యమని కాదని ఈ వీడియోలో వెల్లడించారు.

- Advertisement -

ఇక లాస్ట్​లో ట్విస్ట్​ ఏంటంటే..

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వం.. ప్రైవేటు రంగమైన వొడఫొన్​ ఐడియా (విఐ)లో అతిపెద్ద వాటా అంటే 35.8శాతం ఎందుకు కొన్నదో తెలుసా అంటూ ప్రశ్నించడం హైలైట్​గా నిలుస్తోంది. అయితే ఇది తన దోస్త్​ల్లో ఒకరైన అంబానీ జియోకి అడ్డం రావొద్దనే ఇట్లా ప్లాన్​ చేశారని ఈ వీడియోలో వివరించారు.

ఇక.. దేశంలో బొగ్గు కాదు, బొగ్గు నిల్వలు తగ్గి కరెంటు కోతలు ఎందుకొస్తున్నాయో తెలుసా? అంటే దానికి 3వేలకు టన్ను దొరికే బొగ్గుని 25400 అదాని ఆస్ట్రేలియా బొగ్గుని బలవంతంగా కొనాలని ప్లాన్​ చేశారని అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు.

ఇప్పుడీ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారి యావత్​ దేశాన్నే కాకుండా ప్రపంచ జనాలను కూడా ఆశ్చర్యంలో పడేసింది.. అందరినీ ఆలోచింపజేస్తోంది..

ఇవే కాకుండా సోషల్​ మీడియాలో బేజీపీ పాలిత రాష్ట్రాల్లో నేరాలు‌‌–ఘోరాల తీరు, ప్రైవేటు సంస్థలకు మోదీ ప్రభత్వం లబ్ధిచేకూరుస్తున్న విధానంపై ట్విట్టర్​లో కూడా స్పెషల్​గా పోస్టులు పెడుతున్నారు. అవన్నీ ఇక్కడ కొన్ని ఇస్తున్నాం. ఏది నిజమో, ఏది అబద్ధమో మీరే తేల్చుకోండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement