Tuesday, November 19, 2024

మోడీ క్రేజ్ .. ఇంట‌ర్ నెట్ సెర్చ్ లో ఫ‌స్ట్ ప్లేస్ .. త‌ర్వాత ఎవ‌రో తెలుసా ..

భార‌త‌ప్ర‌ధాని మోడీకి అభిమానులు ఎక్కువే..ఆయ‌న డ్ర‌స్సింగ్ ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాల వ‌ర‌కు సంచ‌ల‌నాలు న‌మోదు అవుతుంటాయి. అంతేకాదు సోష‌ల్ మీడియాలో కూడా మోడీ హ‌వా న‌డుస్తూ వుంటుంది. కాగా ఇంట‌ర్ నెట్ లో అధికంగా స‌ర్చ్ చేసే భార‌తీయుల్లో మోడీ దేశంలోనే ప్ర‌ధ‌మ‌స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ యాహు ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. పొలిటిషియ‌న్స్ లో సోష‌ల్ మీడియాని అధికంగా వాడిన వారిలో మోడీ కూడా ఒక‌ర‌ని తెలిసిందే.. ప్రజలను ఉద్దేశించి ఎలాంటి మెసేజ్‌ ఇవ్వాలన్నా ప్రధాని ముందుగా సోషల్ మీడియానే వాడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫాలోవర్లు కూడా ఎక్కువ.. 2021 ముగియనున్న నేపథ్యంలో దేశంలో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన వ్యక్తుల జాబితాను యాహూ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిల‌వ‌డం విశేషం.కాగా మోడీ మొదటి స్థానంలో నిలవడం ఇదే మొద‌టిసారి కాదు.

2017 నుంచి క్రమం తప్పకుండా ఫస్ట్‌ ప్లేస్‌లో (గతేడాది మాత్రం స్వల్ప తేడాతో దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మొదటి స్థానంలో నిలిచారు) నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఇది చూసిన ఆయన అభిమానులు.. చెక్కుచెదరని మోడీ క్రేజ్‌కు ఇదొక మంచి ఉదాహరణ అని ఆనందాన్ని వెల్లిబుచ్చారు. యాహూ విడుదల చేసిన జాబితాలో టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. కోహ్లీ ఈ ఏడాది టీ20 ఫార్మట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాదిలో జరిగిన వెస్ట్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించడంతో దీదీ మరోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఇక ఇటీవల గుండె పోటుతో హఠాన్మరణం పొందిన బాలీవుడ్‌ ప్రముఖ టీవీ యాక్టర్‌ సిద్ధార్థ్‌ శుక్లా నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయి, అనంతరం విడుదలైన షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యాన్‌ ఖాన్‌ ఈ ఏడాది ఎక్కువ సెర్చ్‌ చేసిన వారి జాబితాలో 7వ స్థానంలో నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement