Saturday, November 23, 2024

దేశంలో కొత్తగా 1500 ఆక్సిజన్ ప్లాంట్లు

దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో దశను ఎదర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే.. కరోనా ఔషదాలు, ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఇప్పటినించే ప్రణాళికలు రూపొందిస్తోంది. కరోనా మహమ్మారి థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌నే అంచనాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

దేశ‌వ్యాప్తంగా 1500 పీఎస్ఏ ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటు చేయలని నిర్ణయించారు. పీఎం కేర్స్‌ నిధుల ద్వారా ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా ఆక్సిజ‌న్ ప్లాంట్లు ప‌నిచేయ‌డం ప్రారంభిస్తే నాలుగు ల‌క్ష‌ల ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ ల‌భ్య‌మ‌వుతుంద‌ని తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజ‌న్ అందుబాటులో ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మోదీ. వాటి నిర్వహణపై ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరును తెలుసుకునేందుకు అత్యాధునిక ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement