కొత్త ఢిల్లీ – అవయవ దానానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపు నిచ్చారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేలా పౌరులను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తున్నదని చెప్పారు. 2013లో 5వేల లోపు అవయవదానాలు చేయగా, 2022 నాటికి అది 15వేలకు చేరిందని ప్రధాని తెలిపారు. అవయవదానంపై అవగాహన పెరుగుతుండటం సంతృప్తికర విషయమన్నారు. 39 రోజుల పసిగుడ్డు మరణించిన వెంటనే ఆమె అవయవాలను దానం చేసిన అమృత్‌సర్‌కు చెందిన దంపతులను ప్రధాని ప్రశంసిం చారు. ఒకవ్యక్తి అవయవదానం ద్వారా 8-9 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చని చెప్పారు. అవయవదానాన్ని ప్రోత్స హించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రధాని, ఈ దిశలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రధానంగా అవయవ దానానికి 65 ఏళ్ల వయోపరిమితి నిబంధన తొలగిస్తామని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement