కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్ నగరంలో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు పునఃప్రారంభం కానున్నాయి. వచ్చేవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభమైతే ఎంతో మందికి ప్రయోజనం చేకూరనుంది.
కాగా, కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ రైలు సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైళ్లు ప్రారంభమైనా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం అనే నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.