Friday, November 22, 2024

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదల యింది. ఒకవైపు టీ-చర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల భర్తీ, పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ పూర్తవడంతో పోటీ-కి దిగిన 21 మంది అభ్యర్థులు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటు-న్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం సోమవారం ప్రకటన జారీ చేయడంతో ఈ పదవులను దక్కించుకునేందుకు భారాసలోని సీనియర్లు, ముఖ్య నేతలు ప్రగతి భవన్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటిం చాలన్న అంశంపై భారాస ఎటూ తేల్చుకోలేకపో తోంది. వా మపక్షాల అనుబంధ ఉపాధ్యాయ సంఘాల అభ్య ర్థులు ఈ ఎన్నికల్లో పోటీ-కి దిగారు. తెలంగాణ పీఆర్‌టీయుతో సహా వివిధ ఉపాధ్యాయ సంఘాలు తమ ప్రతినిధు లను బరిలోకి దింపడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ-కి దిగిన ఎంఐఎం అభ్యర్ధికి భారాస మద్దతు ఇవ్వడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఎమ్మెల్సీ పదవులు దక్కేది ఎవరికో?
ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యులుగా ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ అధికార పార్టీ భారాసలో నెలకొంది. ప్రస్తుతం ఎమ్మె ల్యే కోటాలో పదవీ కాలం ముగిసే ముగ్గురులో ఒకరికి రెన్యువల్‌ అవకాశం ఉంటు-ందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. రెండేళ్లు మాత్రమే పద వీలో ఉన్న కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌కు మరోసారి అవ కాశం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. పదవీకాలం ముగుస్తున్న మిగిలిన ఇద్దరు ఎలిమినేటి కృష్ణారెడ్డి (ఉమ్మడి నల్గొండ జిల్లా), గంగాధర్‌ గౌడ్‌(నిజా మాబాద్‌)లకు ఈ దఫా అవకాశం ఉండదని చెబుతు న్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన గంగాధర్‌ గౌడ్‌కు తొలుత ఇచ్చిన హామీ ప్రకారం రెండుసార్లు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారు. వయసు మీద పడటం, అనారోగ్యం కారణంగా ఎలిమినేటి కృష్ణారెడ్డి ఈసారి ఛాన్స్‌ లేదని అంటు-న్నారు. కవి, గాయకుడు ముఖ్య మంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకాధికారి(ఓఎస్డీ)గా పని చేస్తున్న దేశపతి శ్రీనివాస్‌కు ఈ దఫా శాసనమండలికి అవకాశం ఇవ్వవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నా యి.
ఉద్యమంలో కేసీఆర్‌ వెంట ఉన్న దేశపతి తెలం గాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ టీ-చర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా చేరారు. ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినప్పుడల్లా దేశపతి పేరు తెరపైకి వచ్చేది. తెలంగాణ భాషా సంఘం, సాంస్కృతిక సారధి ఇలా బోర్డు చైర్మన్‌ పదవులకు ఒకప్పుడు దేశపతి పేరు వినిపించేది. మారిన పరిమాణాలతో ఎమ్మెల్యే కోటాలో దేశపతి పేరును ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతుతు న్నారు. ఒకవేళ ఎమ్మెల్యే కోటా వద్దనుకుంటే కళా కారుడిగా గవర్నర్‌ కోటాలో ఆయనను శాసన మండ లికి పంపే అవ కా శం ఉంది. ఇక ఎమ్మెల్యే కోటాలో మూడో పదవిని అలం పూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరెడ్డిని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టీ-ఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత చల్లా పేరును వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్టు- సమాచారం. అలంపూర్‌తోపాటు- సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లాలోనూ చల్లా కుటు-ంబానికి పేరుంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లాను క్రియాశీలకం చేయడానికి సీఎం కేసీఆర్‌ ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్టు- పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యే చల్లా గులాబీ కుండువా కప్పుకొన్నారు. ఉమ్మడి ఖ మ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిద్ధిపేటకు చెందిన ఫారూఖ్‌ హుస్సేన్‌, నిజామాబాద్‌కు చెందిన రాజేశ్వర్‌ రావు, తెలంగాణ స్పోర్ట్స్‌ అధారిటీ- మాజీ చైర్మన్‌ అల్లా వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరుల పేర్లను ఎమ్మెల్సీ ఎన్నికకు భారాస చీఫ్‌ కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు- సమాచారం. తెలంగాణలో ఏడు శాసనసమండలి సీట్లు- ఖాళీ అవుతుండగా ఎమ్మెల్యే కోటాలో మూడు, గవర్నర్‌ కోటాలో రెండు, టీ-చర్ల కోటా ఒకటి, స్థానిక సంస్థల కోటాలో మరొకటి ఖాళీ అవు తున్నాయి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ వెలు వడింది. గవర్నర్‌ కోటాలో రాజేశ్వర్‌ రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌, ఉపాధ్యాయుల కోటాలో కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు.

ఎన్నికల సంవత్సరం కావడంతో..
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహ రించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడకుండా చూడాలని ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నట్టు- సమాచారం. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే నేతల వల్ల ఆయా జిల్లాల్లో పార్టీకి లబ్ది చేకూరే విధంగా ఉండాలని.. అలా కాకుండా అసంతృప్తులు రగిలితే ఇబ్బందులు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్టు- సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement