Wednesday, November 20, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. విచార‌ణ రేప‌టికి వాయిదా..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో ఈరోజు విచారణ జ‌రిగింది. సిట్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ వాదనలు వినిపించారు. నిందితుల తరఫున మహేష్ జట్మలాని వాదనలు వినిపించారు. అయితే సిటిపై తమకు నమ్మకం లేదని, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని మహేష్ కోరారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కేసులు పెట్టారని, కేసుతో సంబంధం లేని వారిని ఎఫ్ఐఆర్ జాబితాలో చేర్చారని మహేష్ వాదనలు వినిపించారు. డివిజన్ బెంచ్ ఆదేశాలు చాలా క్లియర్ గా ఉన్నా సిబిఐతో విచారణ జరిపించాలని కోరడం సమంజసం కాదని సిట్ తరపు న్యాయవాది దుష్యంత్ చెప్పారు. రియా చక్రవర్తి కేసును సైతం ఆయన ప్రస్తావించారు. సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదన్న వాదనను ఆయన తోసిపిచ్చారు. అయితే త‌దుప‌రి విచార‌ణ‌ను హైకోర్టు రేప‌టికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement