Monday, November 18, 2024

ఫ్యాక్ట్ చెక్: పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజయ్య క్లారిటీ

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య స్పందించారు. త‌న జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాన‌ని రాజ‌య్య స్పష్టం చేశారు. లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల భ‌ర్త అనిల్ కుమార్‌ను క‌లిసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు వాస్త‌వం కాద‌ని స్ప‌ష్టం చేశారు. పాత ఫొటోలతో పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. 2019 సంవ‌త్స‌రంలో ఒక క్రైస్త‌వ స‌మావేశానికి ముందు అనిల్ కుమార్‌ను క‌లిసిన‌ప్పుడు దిగిన ఫోటో అని స్ప‌ష్టం చేశారు. వాస్త‌వాలు తెలుసుకోకుండా అస‌త్య ప్ర‌చారం మొద‌లు పెట్టిన వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నానని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసి మనసు గాయపర్చవద్దని విన్నవించారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఎవ‌రికీ ఇవ్వ‌ని ప్రాధాన్య‌త‌ను సీఎం కేసీఆర్ త‌న‌కు ఇచ్చారని రాజయ్య తెలిపారు. అడ‌గ‌క‌ముందే డిప్యూటీ సీఎం ప‌ద‌వితోపాటు త‌న‌కు ఇష్ట‌మైన వైద్యారోగ్య శాఖ‌ను ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో తాను టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాను అన్నారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా కేసీఆర్ నాకు భిక్ష పెట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ ద‌ళితుల ప‌క్ష‌పాతి అని చెప్పారు. ద‌ళితులు త‌లెత్తుకుని తిరిగే విధంగా ద‌ళిత బంధు కార్య‌క్ర‌మాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టారని రాజ‌య్య కొనియాడారు.

ఇది కూడా చదవండి: వైఎస్ఆర్టీపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ?

Advertisement

తాజా వార్తలు

Advertisement