వరంగల్ తూర్పు ప్రజల చిరకాల కల నెరవేరింది. వరంగల్ కు మరో అద్భతమైన అభివృద్దికి ముందడుగు పడింది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవన సముధాయాలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నర్సంపేట రోడ్ లోని ఆజాంజాయి మిల్ గ్రౌండ్ స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వరంగల్ తూర్పులో సంబరాలు మిన్నంటాయి. వరంగల్ తూర్పులో వరంగల్ జిల్లా పరిపాలనా కార్యాలయం ఏర్పాటు చేయటం పట్ల వరంగల్ కార్పోరేటర్లు ప్రజా ప్రతినిదులు, ముఖ్యనాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు క్షిరాభిషేకం చేసారు.
వరంగల్ జిల్లా ఏర్పాటు కావాలనే సంకల్పం,జిల్లా ఏర్పాటై జిల్లా కేంద్రం వరంగల్ తూర్పులో ఏర్పాటైతే గతంలో వెనకబడ్డ ఈ ప్రాంతం ఇప్పుడు అద్బుతంగా అభివృద్ది చెందుతుందనే సంకల్పంతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. చిత్తడిగా మారి అసలు ఇక్కడ ఒక గ్రౌండ్ ఉందా అనే రీతిలో ఉన్న చోట సొంతంగా ముందుకొచ్చి గ్ర్రౌండ్ ను శుభ్రం చేయించారు. ఆ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల బహిరంగ సభలతో పాటు పలు సభలను నిర్వహించారు. జిల్లా ఏర్పాటు తర్వాత గ్రౌండ్ లో ఉన్న చిన్న చిన్న సమస్యలను చొరవ తీసుకుని పరిష్కరించారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం జిల్లా పరిపాలనా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల ఇవ్వడంతో ప్రజల కల నెరవేరింది. ఎమ్మెల్యే నరేందర్ కృషికి ఫలితం దక్కింది.
జిల్లా ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రం వరంగల్ తూర్పులో ఉండటం ద్వారా జిల్లాతో పాటు తూర్పు నియోజకవర్గం అద్బుతంగా అభివృద్ది చెందుతుంది.ఆజాంజాయి మిల్ గ్రౌండ్ చుట్టూరా పేదల ఇండ్లు ఉంటాయి..అక్కడ ఇప్పుడు వ్యాపారం అభివృద్ది జరుగుతుంది. వీధి వ్యాపారులు బాగుపడతారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పేదల ఆస్తి విలువ పెరుగుతుంది. రవాణా సౌకర్యం,రవాణా పెరుగుతుంది. పక్కనే ఉన్న ఖిలా వరంగల్ టూరిజం హబ్ గా మారుతుంది. వరంగల్ తూర్పు దిశ దశను ఈ జిల్లా కేంద్రం మార్చనుందనటంలో సందేహం లేదు.