Friday, November 22, 2024

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష

ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ, ఎమ్మెల్యే స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు. బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన కేసులో నాగేందర్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. రూ.వెయ్యి జరిమానా విధించింది. ఓ వ్యక్తిపై దాడిచేసి గాయపరిచారన్న కేసులో నాగేందర్‌పై అభియోగాలు రుజువు అయ్యాయి. అప్పీల్‌కు వెళ్లేందుకు శిక్ష అమలును నెల రోజులు నిలిపివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement