అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా పాజిటివ్ రోగులకు బాసటగా నిలిచారు. కరోనా పాజిటివ్ వచ్చిన 2వేల మందికి ఉచితంగా మెడికల్ కిట్లు అందిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి హిందూపురంకు మెడికల్ కిట్లు చేరుకున్నాయి. ఒక్కో మెడికల్ కిట్ విలువ రూ.1,100 ఉంటుందని తెలుస్తోంది. కాగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులు పాజిటివ్ రిపోర్టు చూపించి మెడికల్ కిట్ తీసుకువెళ్లచ్చని బాలయ్య సూచించారు. కరోనా పేషెంట్లు క్వారంటైన్లో ఉంటే వారి బంధువులు లేదా స్నేహితులు రావొచ్చన్నారు. కరోనా మందుల కిట్లు కావాల్సిన వారు 9030405508, 9440834749 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ పెద్దమనసు.. కరోనా రోగులకు ఉచిత మెడికల్ కిట్లు పంపిణీ
Advertisement
తాజా వార్తలు
Advertisement