ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్దగా ఉన్న మిజోరాంకి చెందిన జియోన చన (78) ఆదివారం కన్నుమూశారు. జియోన చన కి 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు. జియోన కుటుంబం ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ”ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిజోరాం వాసి మిస్టర్ జియోన్కు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు. కొంతకాలంగా డయాబెటిస్,హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న జియోన గత మూడు రోజలుగా బక్తవంగ్ గ్రామంలోని తన నివాసంలో ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఐజ్వాల్ లోని ట్రినిటీ హాస్పిటల్ లో చేర్పించారు. ఆయన గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతో పాటు మిజోరాంకు కూడా అనేక మంది పర్యాటకులు రావడానికి ఆయన కుటుంబం ఒక కారణం” అని సీఎం జోరాంతంగ ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement