Friday, November 22, 2024

Agra | ఉత్తరప్రదేశ్​లో ఘోరం.. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, బ్లేడుతో గొంతుకోసి..

ఉత్తర ప్రదేశ్​లో 15 ఏళ్ల బాలికపై ఘోరం జరిగింది. హోలీ రోజు సంబురంగా ఆడుకుంటున్న బాలికను కొంతమంది అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా బాలిక తమను గుర్తిస్తుందేమోనన్న కారణంగా ఆమె గొంతుకోశారు. అయితే.. ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో పడి ఉండడాన్ని గమనించిన పాల వ్యాపారి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హోలీ రోజు తప్పిపోయిన 15 ఏళ్ల బాలిక శుక్రవారం చావుబతుకుల మధ్య కనిపించింది. ఆమె గురించి తల్లిదండ్రులు ఆరా తీయగా గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రామంలో హోలీ ఆడేందుకు ఇంటి నుంచి వెళ్లిన ఆ బాలిక తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు.

- Advertisement -

గుర్తు తెలియని వ్యక్తులపై IPC సెక్షన్ 376 (అత్యాచారం), 308 (అపరాధపూరితమైన హత్య), POCSO చట్టం కింద కేసు నమోదు చేసినట్లు హరిపర్వత్ అసిస్టెంట్ కమిషనర్ (ACP) మయాంక్ తివారీ తెలిపారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. తాము తదనుగుణంగా చర్యలు తీసుకుంటాము. బాలిక ఆగ్రాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది అని ఏసీపీ తివారీ తెలిపారు.

శుక్రవారం ఉదయం బాలిక అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి రావడానికి ఇబ్బంది పడుతుండగా పాల వ్యాపారి గమనించాడు. ఆ వ్యక్తి బాలికను గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వాహనంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తాము అనుమానిస్తున్నామని, ఆమెపై దారుణంగా దాడి చేసి గొంతుకోసి చంపేందుకు యత్నించారు. అయితే.. ఆమె చనిపోయిందని భావించి దుండగులు అక్కడే వదిలేశారు.. అని బాలిక తండ్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement