భారత యువతి హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ గా నిలిచి హాట్ టాపిక్ గా మారింది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్ యూనివర్స్-2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు టైటిల్‌ను గెలుపొందింది. దీంతో 21 ఏండ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కంది. ఈ పోటీల్లో 80 దేశాల నుంచి భామలు పాల్గొనగా..హర్నాజ్ సంధు వారందిరినీ అన్ని కేటగిరీల్లోనూ అధిగమించి యూనివర్స్ కిరీటం దక్కించుకుంది.
21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ గా నిలిచి సుస్మితాసేన్, లారాదత్త తరవాత మిస్ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతిగా పేరు సంపాదించుకుంది. మిస్ యూనివర్స్ అయిన హర్నాజ్ సింధు గురించిన తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెచ్చ్ చేస్తున్నారు. హర్నాజ్ సంధు అసలు పేరు హర్నాజ్ కౌర్ సంధు. చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో పుట్టింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. 17 ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రారంభించింది. 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్, 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, మిస్ దివా 2021గా గెలిచింది. ఇప్పుడు 2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. యారా దియాన్ పో బరన్, బై జీ కుట్టంగే అనే పంజాబీ సినిమాల్లోనూ ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది.