కోవిడ్ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో 48మందిపై ఛార్జిషీట్ నమోదు చేశారు. అమెరికాలోని మిన్నసొటలో ప్రభుత్వ ఖాజానా నుంచి సుమారు 250 మిలియన్ల డాలర్ల నిధుల్ని అక్రమంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న పిల్లల పోషకాహారం పథకంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఫెడరల్ అధికారులు గుర్తించారు. మిన్నసొటలో వేలాది మంది పిల్లలకు ఆహారం అందిస్తున్నట్లు కొన్ని నకిలీ కంపెనీలను సృష్టించారని, ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం నుంచి ఆ మీల్స్ కోసం రియంబర్స్‌మెంట్ తీసుకున్నారని కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదించారు. నిజానికి కొంత మందికి మాత్రమే ఆహారాన్ని సరఫరా చేశారని, అయితే ప్రభుత్వ నిధులతో కొందరు లగ్జరీ కార్లు, ప్రాపర్టీలు, జ్వలరీ కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సహాయ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ జరుగుతున్నట్లు మిన్నసొట అటార్నీ ఆండీ లూగర్ తెలిపారు. ఫీడింగ్ అవర్ ఫ్యూచర్ అనే ఎన్జీవో పిల్లలకు ఫుడ్ సర్వ్ చేసినట్లు రియంబర్స్‌మెంట్ బిల్లులు పెట్టింది. అయితే ఈ కేసులో ఫీడింగ్ అవర్ ఫ్యూచర్ వ్యవస్థాపకులు ఏమీ బాక్ పేరును ప్రస్తావించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement