ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: ఎర్రబంగారం ధరలు పసిడితో పోటీపడుతున్నాయి. నిన్నటివరకు ఎర్రబంగారం ధర కంటే.. పసిడి ధర ఎక్కువగా ఉండేది. కానీ బుధవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్లో పసిడి ధరను మించి ఎర్రబంగారం ధరను నమోదు చేసింది. గ్రాము బంగారం ధర 50 నుంచి 51వేల రూపాయలు పలుకుతుండగా ఏనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి రకం ప్రపంచంలోనే ఏ దేశంలో నమోదు కాని విధంగా క్వింటాకు 52వేల రూపాయల ధర నమోదు కాబడింది. ఆల్‌టైం రికార్డుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ములుగు జిల్లా ములుగు మండలం ఏసునగర్ గ్రామానికి చెందిన బల ుగూరి రాజేశ్వర్‌రావు అనే రైతు ఏడు బస్తాల దేశీ రకం మిర్చిని తీసుకరావడంతో లాలా ట్రేడింగ్ కంపెనీకి చెందిన యజమాని క్వింటాకు 52 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఈ ధర ఆల్‌టైం రికార్డుగా వ్యపార వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ నెలలోనే మార్చి 3న ఏనుమాముల మార్కెట్లో 32 వేల రూపాయలు నమోదు కాగా, ఈ నెలాఖరికి కల్లా 52 వేలు ధర రావడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నదని మిర్చి ట్రేడింగ్ కంపెనీకి చెందిన వ్యాపారులు చెబుతున్నారు. బిలియన్ మార్కెట్‌కు కూడా పోటీ పడే రీతిలో ఎర్రబంగారం పోటీపడటం రైతులకు కలిసివచ్చే అంశమని వ్యాపారుల తెలుపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..