కరోనా మహమ్మారితో జనాల ఆర్థిక లావాదేవీలు, కొనుగోలు వ్యవహారాలు అన్నీ మారిపోయాయి. ఎవరి దగ్గర చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కామన్ గా కనిపిస్తోంది. పక్కన పదిమంది జనం ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్లు లీనమై ఉండడం కనిపిస్తోంది. దీనికి విపరీతంగా డేటా కూడా అందుబాటులోకి రావడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య యుకెకు చెందిన వ్యక్తి యాపిల్ ఫోన్ పై మోజుపడ్డాడు. ఐఫోన్13 కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా పే చేశాడు. ఇక ఫోన్ వస్తుంది.. దాంతో వీడియోలు, గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చని తెగ మురిసిపోయాడు.
ఫోన్ ఆర్డర్ పెట్టిన అతను ప్యాకేజీ డెలివరీ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. తను అనుకున్నట్టే ఆ ప్యాకేజీ అతనికి అందింది. డెలివరీ బోయ్ ప్యాకేజీ అందించి అతని సంతకం తీసుకుని వెళ్లాడు. తీరా ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే కళ్లు బైర్లు కమ్మాయి అతనికి. అందులో యాపిల్ ఫోన్ కు బదులు.. క్యాడ్బరీ చాక్లెట్ ఉండడమే అందుకు కారణం. దీనికి సంబంధించిన ఆ కంపెనీకి ట్వీట్ పెట్టాడు.
తాను ఆర్డర్ చేసిన రెండు వారాలకు ప్యాకేజీ అందిందని, అయితే డెలివరీ అయిన ఆ బాక్స్ సీల్ తీసి ఉండడమే కాకుండా ఐఫోన్ ప్లేసులో టాయిలెట్ పేపర్ తో చుట్టిన రెండు ఓరియో చాక్లెట్ బార్ లు ఉన్నాయని తెలిపాడు. ఫోన్ కోసం 77,772 రూపాయలు చెల్లించాను. కొత్త ఫోన్ కోసం రెండు వారాలు ఆగాను. క్రిస్మస్ సందర్భంగా ఫోన్ వస్తుందని, ఎంజాయ్ చేయొచ్చని భావించాను. కానీ, నాకు ఇట్లా జరిగింది అని తన బాధనంతా ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. డెలివరీ కంపెనీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు.