ఉక్రెయిన్ రాజధాని రష్యా బలగాల చేతిలోకి వెళ్లిపోయింది. దాంతో సైనిక దాడులు, బాంబుల దాడులు, వైమానిక దాడులు మోగుతూనే ఉన్నాయి. దాంతో కీవ్ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ ఉద్రికత్త వాతావరణంలో ప్రాణాలతో బయటపడేందుకు స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, షాపులు, బార్లు, సబ్వే స్టేషన్లును షెల్టర్ హోమ్స్‌గా మారాయి. ఉక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఈ సమయంలో ఓ ఉద్వేగ భరిత ఘటన జరిగింది. బాంబుల మోత, క్షిపణుల హోరు, వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య ఓ గర్భిణి ప్రసవించింది. పండంటి పాపకు జన్మనిచ్చింది. గత రాత్రి 8.30 గంటల సమయంలో అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్న ఓ గర్భిణికి ప్రసవ వేదనతో బాధపడుతుంటడంతో వైద్య సిబ్బంది వచ్చి.. ఆమెకు సహకరించారు. వెంటనే ఆ గర్భణిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి ఈ యుద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని టెలిగ్రామ్ యాప్‌లో కొందరు షేర్ చేశారు. మెట్రో స్టేషన్లనే బంకర్లుగా వాడుతున్న స్థానికులు ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. భయానక, దుర్భర పరిస్థితుల్లో పుట్టిన ఆశకిరణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఫ్లాట్‌ఫామ్‌లను ఆవాసాలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement