Thursday, November 21, 2024

Wrestlers | బ్రిజ్​భూషణ్​ కేసు వాపస్​ తీసుకోలే.. అదంతా బూటకపు ప్రచారం..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలను వెనక్కి తీసుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని 17ఏళ్ల రెజ్లర్​, మైనర్​ బాలిక తండ్రి చెప్పారు. మీడియాతో మాట్లాడిన బాధితురాలి తండ్రి.. ఇదంతా వారి కుట్రలో భాగమేనని, ఉపసంహరణ గురించి సోషల్ మీడియాలో వస్తున్నదంతా బోగస్​ అని నొక్కి చెప్పారు. తాము ఆ ఆరోపణలకు కట్టుబడి ఉన్నాము. తాను స్టేషన్ బయట ఉన్నాను. ఢిల్లీలో కానీ, హర్యానాలో లేను అని అతను చెప్పాడు.

ఇక.. ఈ సమస్యపై వ్యాప్తి చెందుతున్న ఊహాగానాలకు ముగింపు పలకాలని కోరుతూ రెండు రోజుల క్రితం రైతులు, ఖాప్ పంచాయతీల (కమ్యూనిటీ కోర్టులు) ప్రతినిధులు ఆల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్​ భూషణ్​ సింగ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలని.. లేకుంటే భారీ నిరసన చేపడుతామని కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు.

రెజ్లర్ల ఆందోళన విషయంలో భవిష్యత్తు వ్యూహంపై హర్యానాలోని కురుక్షేత్ర పట్టణంలో జరిగిన ‘మహాపంచాయత్’లో ఈ విషయంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ‘మహాపంచాయత్’ నిర్వహించారు. అక్కడ రెజ్లర్‌లకు న్యాయం చేయాలని కోరుతూ ఒక ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవాలని నిర్ణయం తీసుకుంది. కురుక్షేత మహాపంచాయత్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్​ జూన్ 9 న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement