విజయవాడ : వెల్లంపల్లి నివాసం ఉండే సొంత డివిజన్ లో టీడీపీ జెండా ఎగరువేసిందని, ప్రజలు, ఉమ్మడి వెంకటేశ్వరరావు(చంటి) పై నమ్మకంతో గెలిపించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. మీడియాతో మాట్లాడుతూ .. చంటిపై మంత్రి వెల్లంపల్లి కక్ష సాధింపు చర్యలు చేపట్టారని మండిపడ్డారు. వెల్లంపల్లికి సవాల్ విసురుతున్నామని, చంటితో నేరుగా పోరాడాలని సూచించారు. చంటి గెలిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, వెల్లంపల్లి గెలిస్తే.. చంటి కాళ్లు మొక్కుతాడని చెప్పారు. ఎమ్మెల్యే పదవే ఎక్కువైతే. కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినట్లు.. మంత్రి పదవి తోడైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, అశోక గజపతిరాజు వంటి సీనియర్లను కూడా తిడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని నోరు పారేసుకోవడం కాదని, రా.. దమ్ముంటే .. తాడో పేడో తేల్చుకుందాం’ అని బుద్దా వెంకన్న మంత్రి వెల్లంపల్లికి సవాల్ విసిరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..