Friday, November 22, 2024

మంత్రి ఉష శ్రీచరణ్ ర్యాలీలో అపశృతి-చిన్నారి మృతి- చంద్రబాబు ఆవేద‌న‌

కళ్యాణదుర్గంలో చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది పోలీసులు అత్యుత్సాహం. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ రాక సందర్బంగా కళ్యాణదుర్గంలో పోలీసుల కఠిన ఆంక్షలు విధించారు,మంత్రి రాక సందర్బంగా పట్టణంలోకి వచ్చే నాలుగు వైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. అస్వస్థతకు గురికావడంతో శెట్టూరు మండలం చేర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్ ,ఈరక్క దంపతుల కుమరై పండు 8 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు.. పట్టణంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ ఇంటి ముందు వెళ్ళడానికి లేదంటూ పోలీసులు ఆపివేసారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకు వెళ్లాలంటూ పోలీసులను వేడుకున్నా పట్టించుకోలేదని తలిదండ్రులు, బంధువులు ఆరోపించారు.మరో మార్గం గుండా వెళ్లాలంటూ పోలీసుల బాధితులకు సూచించారు. దాదాపుగా అర్థ గంట పాటు ప్రాధేయ పడిన పోలీసులు పట్టించుకోలేదని పోలీసులు పై ఆగ్రహించారు. చివరికి పోలీసుల తో వాదించి మరో మార్గంలో చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లిన కుటుంబసభ్యులు,అరగంట ముందుగా ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే చిన్నారి ప్రాణం దక్కేదని వైద్యులు తెలిపార‌ని.. పోలీసుల తీరు వల్లే మా చిన్నారి ప్రాణం పోయిందంటూ ఆందోళనకు దిగారు చిన్నారి కుటుంబ సభ్యులు.ఈ ఘ‌ట‌న‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement