Friday, November 22, 2024

తెలంగాణ‌లో సినిమా థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు లేవ్ – ఏపీ మంత్రుల‌తో నేను మాట్లాడ‌తా – మంత్రి త‌ల‌సాని

సినీ ప‌రిశ్ర‌మ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని, సినీ ప‌రిశ్ర‌మ‌కు హైద‌రాబాద్ హ‌బ్ గా ఉండాల‌న్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లోని సినిమా థియేట‌ర్ల‌పై ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌బోవ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అఖండ‌, పుష్ప సినిమాల‌తో సినీ ప‌రిశ్ర‌మ పుంజుకుంద‌న్నారు. సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవని.. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమేనని స్పష్టం చేశారు తలసాని. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని.. హైదరాబాద్ లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు. తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌లు పెంచామ‌ని, ఐదో ఆట‌కు అనుమ‌తి ఇచ్చామ‌ని వెల్ల‌డించారు. ఏపీలో థియేటర్ల సమస్యపై తాను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని తలసాని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement