Friday, November 22, 2024

TS Assembly: మంత్రి తలసాని వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

అసెంబ్లీలో సభ వేదికగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిగా మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ జరిగే సమయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డిని కాంట్రాక్టర్ తో పోల్చారు మంత్రి తలసాని. దీంతో తలసానికి కోమటిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను కాంట్రాక్టర్ ను అయితే  పేకాట ఆడినోళ్లు మంత్రులు కావొచ్చ అంటూ సెటైర్లు వేశారు. దీంతో కోమటిరెడ్డి పై టీఆరెస్ నేతలు మండిపడ్డారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి , పువ్వడా , బాల్క సుమన్ లు కోమటిరెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement