బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటలపై తలసాని ఫైర్ అయ్యారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అనడం ఈటల రాజేందర్ అహంకారానికి నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈటల హుజురాబాద్‌లో బీసీ అని.. శామీర్‌పేటలో ఓసి అని ఎద్దేవా చేశారు. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు.. నాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడే అన్న విషయాన్ని మరిచిపోవద్దు అని తలసాని గుర్తు చేశారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గతంలో విద్యార్థి నాయకులైన బాల్క సుమన్, గ్యాదరి కిశోర్ లాంటి వారికి అవకాశం కల్పించి, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని తెలిపారు. గెల్లు శ్రీనివాస్‌కు కూడా అదే విధంగా కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. జానారెడ్డికి పట్టిన గతే ఈ ఉప ఎన్నికల్లో ఈటలకు పడుతుందన్నారు. గతంలో ఆరు సార్లు కేసీఆర్ దయాదాక్షిణ్యాలపై ఈటల విజయం సాధించారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్‌కు తప్పకుండా గుణపాఠం చెబుతారు అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు!