GHMC క్వార్టర్స్ లలో నివసిస్తున్న ప్రజలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త చెప్పారు. క్వార్టర్స్ ఇక మీవే కాబోతున్నాయని ఆయన ప్రకటించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్, బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయగూడ, రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట ప్రాంతాల్లో లబ్ధిదారులతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుండి రెగ్యులరైజ్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుక అందిచారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తనకు ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు తెలుసన్నారు. GHMC క్వార్టర్స్, లీజు ల్యాండ్స్ లలో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళానని తెలిపారు. పెద్ద మనసుతో రెగ్యులరైజ్ చేసేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి KCR కు మంత్రి తలసాని కృతజ్ఞతలు తెలిపారు.
తమ ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయాలన్న లబ్ధిదారుల విజ్ఞప్తితో నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రకటనతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీశ్రీం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.