ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణే జరగలేదన్నట్లు బిజెపి, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తుందన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. గ్రామీణ అభివృద్ధి నిధులకు కూడా కోత విధించిందని విమర్శించారు. దేశంలో 40కోట్ల జనాభా ఉన్న దళిత, గిరిజనులకు బడ్జెట్ లో సరైన నిధులు కేటాయించలేదని విమర్శించారు. తెలంగాణకు బడ్జెట్ లో ఎందుకు నిధులు కేటాయించడం లేదని , తెలంగాణ ..భారతదేశంలో లేదా అని నిలదీశారు. ప్రజలకు మేలు జరగాల్సిన వాటి కోసం రాజ్యాంగసవరణ జరగాలి. బీజేపీ మతాలను రెచ్చగొట్టడం తప్పితే.. చేసిందేం లేదని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..