Saturday, November 23, 2024

కోయిల్ సాగర్ ప్రాజెక్టులో బోటింగ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనినాస్ గౌడ్

మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్‌ను మంత్రి శ్రీనినాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ఇవ్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రర్యాటకంగా అభివృద్ధి జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండలు, నాగర్జున సాగర్‌లోని వారి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న వనరులను డెవల్​ చేయలేదన్నారు.

కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రామప్ప ఆలయం, భూదాన్ పోచంపల్లి మన రాష్ట్రంలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందటం ఇందుకు నిదర్శనంగా చెప్పారు. అభివృద్ధి చేసేవారిపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ది ఎనిమిదేండ్లలో జరిగింది. వచ్చే ఏడాది వరకు కొయిల్ సాగర్ వద్ద పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లకు పర్యాటక శోభ తెచ్చేందుకు ముందస్తుగా ప్రణాళికలు చేపట్టామని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement