హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నిర్మిస్తోన్న నీరా కేఫ్ ని పరిశీలించారు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గీత కార్మికులకు ప్రోత్సాహం ఇచ్చేలా నెక్లెస్ రోడ్లో రూ.25 కోట్లతో నీరా కేఫ్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కులవృత్తులు చేసుకునే వారిని అవహేళన చేస్తే ఏ పార్టీకి చెందిన వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడ తయారైన నీరా ఉత్పత్తుల్లో ఓ పానీయాన్ని సేవిస్తూ మంత్రి ఫొటోలకు పోజిచ్చారు.కేఫ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నీరా ఉత్పత్తుల ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు నీరా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతామని ఆయన తెలిపారు.
నీరా ఉత్పత్తుల్లో పానీయాన్ని సేవించిన ‘మంత్రి శ్రీనివాస్ గౌడ్’ – వైరల్ గా ఫొటోస్
Advertisement
తాజా వార్తలు
Advertisement