తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో రైతును అనవసరంగా వారిని రెచ్చ గొట్టవద్దని అన్నారు. రైతుల కడుపు మండితే ప్రధానిని రోడ్ మీద నిలబెట్టారని పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చే బీజేపీ నేతలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. పార్లమెంట్లో తెలంగాణ పథకాలు బాగున్నాయని కేంద్ర మంత్రులు స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర అధికారులు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేశారని తెలిపారు. ఇవన్నీ బీజేపీ నేతలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని మంత్రి హితవు పలికారు.
తెలంగాణలో మూడోసారి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన టిఆర్ఎస్ పార్టీని మొదటిసారి 63 సీట్లతో గెలిపిస్తే.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు పథకాలతో రెండోసారి 88 సీట్లతో అధికారం కట్టబెట్టారన్నారు. మూడోసారి ఇంతకు మించిన సీట్లతో ప్రజలు మళ్ళీ గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..