Wednesday, November 20, 2024

కోవిడ్ పై అలసత్వం వద్దు.. విద్యార్థులు పట్ల జాగ్రత్తలు తీసుకోండి

కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల వేళ… సెప్టెంబర్ 1వ తేదీ నుండి తెలంగాణలోని విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతున్నాయి. నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కొవిడ్ నిబంధనల అమలులో అలసత్వం చూపరాదని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్‌ పూర్తి చేసేందుకు మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల సహకారాన్ని తీసుకుని శుభ్రం చేయాలని కోరారు. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా, చిన్నారులు పాఠశాలలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలని కోరారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులు తప్పనిసరి గా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో ఎవరికైనా జ్వర సూచన ఉంటే ఆయా స్కూళ్ల‌ ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ కోవిడ్ నిర్దారణ అయితే విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. హాజరయ్యే విద్యార్థులు శానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించాలని కోరారు.

ఇది కూడా చదవండిః కోరలు చాస్తున్న కరోనా… బయటకొచ్చిన మరో కొత్త రకం వేరియంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement