Wednesday, November 20, 2024

విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

శ్రీచైతన్య కళాశాలలో ఇంట‌ర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై రాష్ట్ర విద్యా శాఖ‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలిచ్చారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేసిన మంత్రి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే స్టూడెంట్ మృతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో… కృష్ణారెడ్డి, ఆచార్య, వార్డెన్ నరేష్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సిబ్బంది పట్టించుకోలేదని.. లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. హాస్టల్ లో టార్గెట్ చేసి తమను కొడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement